ఈ రోజుల్లో ముఖ్యంగా యునతలో టాటూలు వేయించుకునే ట్రెండ్ ఎక్కువగా ఉంది. ప్రజలు తమ శరీరంలోని వివిధ భాగాలపై పచ్చబొట్టు వేయించుకుంటుంటారు. అయితే దీనికి ముందు, తరువాత కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఎవరైనా పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటే ముందుగా సరైన స్థలాన్ని నిర్ణయించుకోవాలి. అకస్మాత్తుగా కళాకారుడి దగ్గరకి వెళ్లి ఒకసారి అనేక డిజైన్లను చూసి గందరగోళానికి గురవుతుంటారు. అలా కాకుండా ఏ డిజైన్ ను వేయించుకోవాలనుకుంటున్నారు దాని గురించి ముందుగానే సెరెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టాటూ వేయించుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు, తరువాత మీరు చర్మ సంరక్షణ, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
పచ్చబొట్టు వేయించుకోబోతున్నట్లయితే కొత్త సూదిని ఉపయోగించాలని కళాకారుడితో ముందుగానే మాట్లాడాలి. దీనికోసం అదనంగా బిల్ వేసిన పర్వాలేదు. పాత సూదులు అనేక వ్యాధుల సంరక్షణకు కారణం అవుతాయి. చిన్న ఆరోగ్య సమస్యలే కాకుండా పెద్ద వ్యాధులకు కూడా దారితీస్తాయి. పచ్చబొట్టు వెయ్యబోతున్నట్లయితే కనీసం 48 గంటల ముందు ఎలాంటి ఆల్కహాల్ తాగకుండా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తాన్ని పలచబరుస్తుంది. పచ్చబొట్టు వేసుకునే సమయంలో లేదా తరువాత రక్తస్రావనం సమస్యలను తగ్గిస్తుంది. అలాగే కెఫిన్ ఉన్నా పానీయాలను తీసుకోకుండా ఉండండి. ఎందుకంటే ఇది డిహైడ్రేషన్ కు కారణం అవుతుంది. పచ్చబొట్టు వేసుకునేటప్పుడు మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. రక్తాన్ని పలచబరిచే మందులేవీ తీసుకోవద్దు.