అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా . వీటిని పాటించాలని, తెలుసుకోవాలని ఒకటి రెండుసార్లు ఎవరైనా చెప్తుండవచ్చు. తప్ప ఎల్లప్పుడూ ఎవరూ చెప్పరు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు సరైన షౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా ప్రధానమైన కారణాలలో ఒకటి. ఆహారాన్ని తప్పుగా వాడిన, అవసరం అయినప్పుడు మందులు వేసుకోకపోయినా మీరు మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి వాటిని ఎవ్వరూ చెప్పకపోయినా, సరైన సమయానికి, సరైన విధంగా మీరు పాటించి తీరాలి. లేకపోతే ఇబ్బందులు పడుతార అంటున్నారు నిపుణులు.
మధుమేహం, పిసిఓఎస్, థైరాయిడ్ వంటి సమస్యలను ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే బాధితులకు డాక్టర్లు తరచుగా చెప్పినా విషయాలు కూడా ఉండవచ్చు. అవి మీకు మీరే పాటించాలి. ఏంటంటే.... ఆ వ్యాధులకు కారణమయ్యే అలవాట్లను మార్చుకోవటం, అవసరం లేని వాటిని మానుకోవటం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవటం వంటివి మీకు మీరు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. డాక్టర్ల సలహాలు, చికిత్సలు మెరుగుగా పని చేయాలన్నా ఇక్కడ మీరు మారాలి.