ఇదిలా ఉంటే మన గ్రంథాలు, పురాణాలు ఆ కాకిని యామదూతగా భావిస్తారు. అందులో నిజం ఎంత ఉంది.. మనిషి చావునకు కాకి కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది.. అనే విషయాలు అనేకం దాగి ఉన్నాయి. మరి ఈ విషయాలన్నిటి గురించి పురాణాలు, గ్రంధాలు ఎలాంటి సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ ఆకాశంలో తిరిగే కాకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చిన, ఏం విషయాలు అయినా ముందుగానే కని పెట్టేస్తుందట. సుమారుగా మూడు నెలలు ముందే ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించునున్నాయి కాకికి తెలిసిపోతుందట. అందుకే పూర్వకాలంలో పెద్దవారు కాకుల ద్వారానే ఎదురు కాబోయే సంఘటనల గురించి వివరించే వారట.
మీ ఇంటి ప్రాంగణంలో కాకుల గుంపులు కూర్చుని అరుచుకుంటే అవి గొడవ పడినట్లు అర్థం. అలా ఇంటి ముందు గొడవ పడినట్లుగా అరుచుకుంటే ఏంటి యజమానికి ఇబ్బందులు కలుగుతాయని అర్థం చేసుకోవాలి. కాకులు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఉత్తరం వైపున లేదా తూర్పు వైపున చెట్లు పై కూర్చుని అరిచినప్పుడు వింటే శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఇంటి పైకప్పు మీద దక్షణం దిశగా కూర్చుని అరిస్తే మంచి సంకేతం కాదంటున్నారు పండితులు. అలా అరిస్తే ఇంట్లోనే వారు ఎవరైనా మృత్య గండం ఉందనే సంకేతనం అని తెలుసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి నీళ్లు తాగటం చూస్తే సంపాదన వస్తుందని సంకేతం. అలాగే ఏదైనా పని కోసం ఎక్కడికైనా వెళితే ఆ పనిలో విజయం సాధిస్తారని సంకేతం అంటున్నారు పండితులు.