నివారణ చర్యలు పాటించకపోతే భవిష్యత్తులో ఈ భూమికి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు వారు సముద్ర ఉపరితలం నుంచి ఒక శిలాజాన్ని తవ్వి, డైనోసర్ల కాలంలో ప్రపంచం ఎలా వేడెక్కిందో, అప్పటి పరిణామాలు ఎలా ప్రభావితం చేస్తాయో మరోసారి విశ్లేషించారు. అలాగే భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. గ్లోబల్ వార్నింగ్, భూతాపం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు భూమి నుంచి వెలువాడే గ్రీన్ హౌస్ వాయువుల పర్యావరణం తగ్గకపోతే భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచం 'హాట్ హౌస్, 'వార్మ్ హౌస్, కూల్ హౌస్, ఐస్ హూస్ ' వంటి మొత్తం 4 రకాల వాతావరణ మార్పులను చవి చూసిందని గుర్తు చేశారు. ఇంతకాలం భూమి ఐస్ హౌస్ పోరలో ఉండేదని, ప్రస్తుతం దీనిపై గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం విపరీతంగా పడుతోందని చెబుతున్నారు. భూమి వేడెక్కడానికి, గ్రీన్ హౌస్ వంటి విష వాయువులు వెలువాడటానికి మానవ కార్యకలాపాలే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత దశాబ్దాలలో బోగ్గు, చమురు వంటి శీలాజ ఇంధనాలను కల్చడం వల్ల కార్బన్ డయాక్సైడ్ గాఢత మరింత పెరిగింది. ప్రస్తుతం భూమి నుంచి గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదలకు కూడా అదే కారణం అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదే కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో మానవాళి తీవ్రమైన పర్యావరణ సమస్యలను, మనుగడ ముప్పును ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.