చాలామంది దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. దుఃఖం వచ్చినప్పుడు అసలు తట్టుకోలేరు. కళ్ళంట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. నవ్వు ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. కానీ అప్పుడప్పుడు గుండెలోతుల్లొంచి పెల్లుబికే నిజమైన బాధ, భావోద్వేగం, దుఃఖం, కన్నీళ్లు కూడా మనకు మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ సందర్భాన్ని మనసారా ఫీల్ అవ్వటం వల్ల వాటి తాలూకు సమస్యల నుంచి బయటపడేందుకు అవసరమైన రసాయానిక చర్యలు శరీరంలో జరుగుతాయని, దీంతో దుఃఖాన్ని అధిగమించగలుగుతామని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా దుఃఖం వచ్చే సందర్భం ఎదురైతే .. మనసులో బాధగా అనిపించి కళ్ళు చెమ్మగిల్లుతుంటే..

ఆ భావోద్వేగాన్ని బలవంతంగా అణచే ప్రయత్నం మాత్రం చేయవద్దనేది నిపుణుల సలహా. ఎందుకంటే ఆ సమయంలో మీరు పెట్టుకునే కన్నీళ్ళ మీ మనసుకు తేలిక పరుస్తాయి అంటున్నారు. నిజానికి దుఃఖంలోంచి వచ్చిన కన్నీళ్లు శరీరంలో పారాసింపథెరటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తానని, దీనివల్ల మనసును తేలికపరిచే ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అది ఎంతటి బాధ అయినా, బాబోద్వేగమైన మనసు తేలిక పడుతుంది. అలాగే నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా బాధలు, భావోద్వేగాలు,

దుఃఖాన్ని కలిగించే భావాలను బలవంతంగా అణిచివేస్తే మాత్రం ఒత్తిడి, ఆందోళన ఎక్కువైపోతాయి. ఆరోగ్యంపరంగానూ నష్టం జరుగుతుంది. కాబట్టి అతిగా ఎక్కువ దుఃఖం మంచిది కాదు. దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్లు అసలు ఆగవు. ఎందుకో తెలియదు దుఃఖం మరి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మనసుకు బాధగా అనిపించినప్పుడు దుఃఖం అనేది వస్తుంది. దుఃఖం వచ్చినపుడు అస్సలు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము. ఎందుకో తెలియదు అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి దుఃఖం కూడా మనకి మంచిదే. ఆనందంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ దుఃఖం కూడా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: