చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా బొద్దింకల బేడదా అనేది సహజంగానే కనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా కిచెన్ బెడ్ రూమ్లలో ఎక్కువగా వీటి బెడద ఎక్కువగా కనిపిస్తుంది. బొద్దింకలు చూస్తే కొంతమందికి అసలు పడదు. ముఖ్యంగా మహిళలు అయితే బొద్దింకలు చూస్తే భయంతో పరిగెత్తుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమేయవచ్చు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


ముందుగా బొద్దింకలకు పసుపు రంగు అంటే చాలా ఇష్టపడతాయట. అందుకే ఆ రంగు కలిగిన వాటిని ఆకర్షిస్తాయట. ఆ రంగు కలిగిన పదార్థాలు కిచెన్ వైపు ఉండకపోవడమే మంచిది. ఏవైనా డబ్బాలు కూడా ఆ కలర్ లో ఉంటే వాటిని దాచేయడం మంచిది.


దోసకాయల ముక్కలను తిన్న తర్వాత కొన్నిటిని కిచెన్ లో పెట్టడం వల్ల ఆ వాసనకి అవి బయటకు వెళ్ళిపోతాయి.


బోరిక్ పౌడర్ ఎన్నోవాటికి ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే వీటిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లితే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.


నూనె వస్తువులు నూనె ఆహారాలు ఏవైనా సరే కింద పడకుండా చూసుకోవాలి. ఇవి కింద పడితే బొద్దింకలు ఈ వాసనకు ఆకర్షించి వస్తాయట. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను కింద పడకుండా చూసుకోవాలి.


మొక్కజొన్న పిండి ,చక్కెర పొడిని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట పెట్టడం వల్ల ఆ మిశ్రమాన్ని తిన్న వెంటనే బొద్దింకలు మరణిస్తాయట.


కిచెన్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా ఒకే చోట వంట పాత్రలను పెట్టరాదు ఇలా పెట్టడం వల్ల అవి వాసనను బట్టి ప్రతిరోజు వస్తూ ఉంటాయి అందుకే పాత్రలను మార్చడం చాలా మంచిది.


బొద్దింకలు ఎక్కువగా సింక్ ఉండే చోట కనిపిస్తూ ఉంటాయి. అందుకే  ఎప్పుడూ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అందులో ఎలాంటి ఆహార పదార్థాలను ఉండకుండా శుభ్రం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: