ఇక గత కొన్ని దశాబ్దాల క్రితం వరకు మనదేశంలో అత్యంత డబ్బులు ఉన్నవారు కారులో తిరిగేవారు. ఇక నేడు మన భారతదేశంలోనే అతిపెద్ద నగరాల్లో మాత్రమే కాదు.. చిన్న చిన్న నగరాల్లోనూ కార్లు తిరుగుతున్నాయి. అయితే భారతదేశంలో మొదటి కారు ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కాదు అప్పట్లో అత్యంత ధనవంతులున్న నగరంలో మొదటిసారిగా కారు అడుగు పెట్టింది.చాలా మంది దేశంలోని అత్యంత ధనవంతులు ఢిల్లీ ముంబైలో నివసిస్తున్నారని భావిస్తారు. అయితే మనకు స్వాతంత్రం రాకముందు 1897 వ సంవత్సరంలో అత్యంత సంపన్న నగరంలో కోల్కత్త కూడా ఒకటి.
ఈ సమయంలో కోల్‌కాతా భారతదేశంలోని ఒక ప్రముఖ నగరం. ముఖ్యంగా కళలకు ప్రసిద్ధి చెందింది. అందుకే అప్పట్లో కోల్‌కాతాలో చాలా మంది ధనవంతులు ఉండేవారు. దేశంలోనే తొలి కారు కూడా ఈ నగరానికే వచ్చింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదికనివేదిక ప్రకారం ఇండియాలో మొదటి కారు 1987లో కొనుగోలు అయింది. అలాగే 1986లో ఒక ప్రకటనను ప్రచారం చేయడానికి కోల్‌కాతా వీధుల్లో మొదటిసారిగా కారు తిరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక కోల్‌కాతా ప్రజలు ఆ కారు ప్రకటన చూడడానికి ఆసక్తిని కనబరిచేవారు.