టీమిండియా మాజీ క్రికెటర్‌ ధోని కి ఉన్న పాపులారిటీ, క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికే ధోని ఉన్న క్రేజ్‌ ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికీ ధోని ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా అది టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోతుంది.తన ఆటతీరు, సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ధోని ఎప్పటికప్పుడు కొత్ల లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జులపాల జుట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు.తాజాగా ధోని హెయిర్ కట్ చేయించి కొత్త లుక్‌ లో దర్శనమిచ్చాడు. తన హెయిర్‌ స్టయిల్‌ను పూర్తిగా మార్చి, స్టైలిష్‌, యంగ్‌ లుక్‌తో కుర్రాడి లా కనిపిస్తున్నాడు.ధోనీ తాజా లుక్‌ ఫొటోలు ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీం తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశారు.ఇక ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఫ్యాన్స్‌ హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్‌ లో నవ యువకుడి లా కనిపిస్తుండటం విశేషం.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు మాత్రమే ఆడుతున్నాడు.అయితే, మైదానంలో తన బ్యాటింగ్‌ తో అందరినీ ఆకట్టుకున్న ఎంఎస్ ధోనీ.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. కేవలం ఐపీఎల్‌ సీజన్‌ లో మాత్రమే ఆడుతున్నారు. ఐపీఎల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్ తరపున ఆడుతున్నారు. ఐపీఎల్‌ మినమా మిగతా సమయంలో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ కోసం ధోనీ కేటాయిస్తుంటారు. ఇక, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటున్నారు. మిగతా సమయం కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: