ఇష్టం లేని మాటలు విన్నప్పుడో, అనుకున్నది జరగనప్పుడో కూడా రావచ్చు. ఏది ఏమైనా అది కోపం మనిషికి శత్రువు లాంటిది అంటున్నారు నిపుణులు. అయితే కోపం వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏవి ? ఆ సందర్భంలో కాళ్లు, చేతులు ఎందుకు వణుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కారణాలేమైనా అయి ఉండవచ్చు. కోపం వచ్చే సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సంకేతనాలు మెదడుకు వెశ్తాయి. దీంతో ప్రతి చర్యగా అడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి వెంటనే శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తుంది. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవటానికి అవసరమైన ప్రేరణ కూడా లభిస్తుంది. ఈ సందర్భంలో ఆ పరిస్థితిని ఎదుర్కోవాలా? లేక అక్కడి నుంచి వెళ్ళిపోవాలా?
అనే నిర్ణయం తీసుకోవడంలో కూడా అడ్రినల్ హార్మోన్ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం వంటివి చేస్తారు. మరి కొందరు అక్కడే ఉడికిపోయి పరిస్థితిని ఎదుర్కోవడానికి గొడవకు దిగుతారు. దీనికి ప్రధాన కారణం కోపానికి, ఒత్తిడికి కారణమైన అడ్రినల్ హార్మోన్ అధికంగా ఉండటమే. అడ్రినల్ హార్మోన్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అంత ఎక్కువగా కండరాలపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కాళ్లు, చేతులు, శరీరంలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే రక్తప్రసరణలో హెచ్చు తగ్గులు సంభవించడం, హార్ట్ రేట్ పెరగటం వంటివి కోపంలో జరుగుతాయి. వీటన్నిటికీ అడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవ్వటమే ప్రధాన కారణం అని నిపుణులు పేర్కొంటున్నారు.