ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి బీసీఓడీ సమస్య అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పిసిఓడి సమస్యతో బాధపడుతున్నారు. అసలు పీసీఓడీ అంటే ఏమిటంటే.. పాలిసిస్టిక్ కోవేరియం డిజాస్టర్. ఇది ఒక హార్మోన్ కు సంబంధించిన సమస్యగా చెప్పొచ్చు. అయితే ఈ సమస్య ఉంటే పీరియడ్స్ అనేది క్రమంగా రాదు. అలాగే బరువు పెరగడం, అప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్ మారిపోతూ..

చికాకు, విసుగు లాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్ అనేది అంత ఈజీగా తగ్గేది కాదు. ఇక మీరు ఈ సమస్యను తగ్గించుకోవాలంటే వైద్యుల సలహాతో పాటు ఈ ఐదు ఆసనాలు తప్పక వేయాలని అంటున్నారు వైద్య నిపుణులు. వీటిని వేశారంటే ఈ సమస్యల నుండి మీరు ఈజీగా బయటపడవచ్చు. మరి ఇంతకీ ఆ ఆసనాలు ఏమిటో చూద్దాం. శవాసనం : మీరు శవాసనం వెయ్యటం వలన పిసిఓడి సమస్యను చాలా తక్కువ తగ్గించవచ్చు అని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ సమస్య వల్ల మనసు పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందట. కాబట్టి శవాసనం వేయటం వలన ఒత్తిడి దూరం అయ్యి ప్రశాంతంగా ఉంటారట.

 అదేవిధంగా ఈ ఆసనం వల్ల హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయట. బాలాసనం: ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు తొందరగా ఉపశ్రమమం పొందాలంటే తరచుగా బాలాసనం వెయ్యాలని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక మీరు ఈ ఆసనం వేయడం వలన హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయట. అలాగే చికాకు, విసుగు, ఆందోళన లాంటివి కూడా తగ్గుతాయట. త్రికోణాసనం : ఈ ఆసనం వేయడం వలన కూడా మీరు ఈ సమస్యను నియంతరించవచ్చట. దీని వల్ల పెల్విక్ ఏరియాలో వచ్చేటటువంటి నొప్పులు తగ్గుతాయట. అలాగే ఈ ఆసనం వలన కొంత ఎనర్జీ అనేది మీకు లభిస్తుందట. అంతేకాకుండా త్వరగా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుందట. అందుకే ఈ ఆసనాలు చేస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: