గర్భిణీ స్త్రీలు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం బిడ్డకి మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం బిడ్డ ఆరోగ్యాన్ని కి మేలు చేస్తుంది. సంతానం కనాలనుకున్న స్త్రీకి గర్భధారణ అనేది అత్యంత సంతోషాన్ని కలిగించే అంశంగా పేర్కొంటారు. అదే సందర్భంలో ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణ సమయంకంటే, ప్రెగ్నెన్సీ టైమ్ లో తీసుకునే ఆహారాల్లో ఎక్కువ పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని, అప్పుడే గర్భిణీతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అందుకోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫోలిక్ యాసిడ్, ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి,

గర్భిణీలు ఆకుకూరలు తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బచ్చలి కూర, మెంతికూర, ఆవాలకూర,తోటకూర, పాలకూర వంటివి వారంలో రెండు మూడు సార్లయినా తింటూ ఉండాలి. ఇవి గర్భిణీకి మేలు చేయటంతో పాటు పుట్టబోయే శిశువు మెదడు, వెన్నుపూస అభివృద్ధికి సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఎదగాలన్నా, గర్భిణీ హెల్తీగా ఉండాలన్న ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలను తీసుకోవటం చాలా ముఖ్యం. వివిధ రకాల పప్పులు, కిడ్ని బీన్స్, చిక్కుళ్లు వంటి కాయగూరల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి.

శిశువు శరీర నిర్మాణానికి, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి. అలాగే ఫైబర్ కలిగి ఉన్నందున గర్భిణీలలో మలబద్దకం, అజీర్ణ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ప్రోటీన్లు, విటమిన్లతో పాటు కాలుష్యం అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు పాలు, పెరుగు, జున్ను వంటి మిల్క్ ప్రొడక్ట్స్ తప్పక తీసుకోవాలని పోషక ఆహార నిపుణులు అంటున్నారు. ఇవి పుట్టబోయే బిడ్డలు దంతాలు, ఎముకల దృఢత్వానికి మేలు చేస్తాయి. పండ్లు, కూరగాయలు తినటం వల్ల అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి గర్భిణీలు తింటే, వారికే కాకుండా పుట్టబోయే శిశువుకు మేలు జరుగుతుంది. కాబట్టి అరటి, దాక్ష, నారింజ, యాపిల్ వంటి పండ్లు డైట్ లో భాగంగా ఉండేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: