ఒక అంశంపట్ల విశ్లేషణ వాస్తవానికి ఒక విలువైన సాధానం కావచ్చు. కానీ అన్ని సందర్భాలలోనూ అలాగే పని చేయదు. అత్యవసర పరిస్థితుల్లో, వ్యక్తిగత నిర్ణయాలలో, ప్రమాదాలను నివారించడానికి ఒక మార్గంగా ఉపయోగించినప్పుడు ఓవర్ ఎనాలిసిస్ అనేది మీ విజయానికి అడ్డంకి గా కూడా మారవచ్చు అంటున్నారు నిపుణులు. పైగా ఓవర్ ఎనాలిసిస్ మిమ్మల్ని అనిశ్చితిలో ఉంచడం ద్వారా ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకునే కీలకమైన దశ నుంచి మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. కాబట్టి వైఫల్యం ఎదురైనప్పటికీ సరైన మార్గం కనుగొనడానికి, మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోవడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుందని ఆలోచనతో ముందు కు సాగాలంటున్నారు నిపుణులు.
తెలియని విషయాల గురించి ఆలోచించడం, తెరి అని పనులు చేయటం ఎవరికైనా కొంత భయంగానే అనిపిస్తుంది. అలాగని విఫలం చెందుతాయని, తప్పులు దొర్లుతాయనే ఆలోచనతో మీరు కంఫర్ట్ జోన్ లోనే ఉండటానికి ఇష్టపడితే జీవితంలో ఎదగటం కష్టం కావచ్చు. 'ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి కొత్తగా ఏది ప్రయత్నించలేడు ' అని ఐన్ స్టిన్ అన్నట్టుగా... ఇక్కడ తప్పు లేదా వైఫల్యం గురించిన ముందస్తు ఆలోచన మీ ఎదుగుదలను, సామర్ధ్యాన్ని పరిమితం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా కొత్త అనుభవాలను నివారించడం ద్వారా నేర్చుకునే మార్గాలను, ఎదిగే అవకాశాలను కోల్పోతారు.