పైగా ప్రతి చిన్న విషయానికి అదిగా ఆలోచించే ధోరణి ఇటీవల పెరుగుతోందని చెప్తున్నారు. దీంతో రాత్రిళ్లు నిద్ర నాణ్యత తగ్గటం, క్రమంగా నిద్రలేమికి దారి తీయడం, యాంగ్జైటి, గుండె దడ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే అవి డిప్రెషన్, పక్షవాతం, గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటపడే మార్గం ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ నుంచి బయట పడేందుకు చక్కటి మార్గం బాధ్యతలు తమ పనులపై ఎక్కువగా ఫోకస్ చేయడం.
అలాగే యోగా, మెడిటేషన్, వివిధ వ్యాయామాలు రెగ్యులర్గా ఉండేలా చూసుకోవడం ద్వారా అతి ఆలోచనలను డైవర్ట్ చెయ్యవచ్చు అంటున్నారు నిపుణులు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీలో ఓవర్ థింకింగ్ కు దారితీసిన పరిస్థితులు, వాటికి మూల కారణాలు తెలుసుకొని నివారించే ప్రయత్నం చెయ్యాలి. ప్రతికూల ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు అవసరమైన సానుకూల ఆలోచనలను ప్రాక్టీస్ చెయ్యటం, ఒంటరిగా కాకుండా ఎప్పుడూ నలుగురిలో ఉండటం, ఏదైనా వర్క్ లో నిమగ్నం కావటం వంటివి చేయాలంటున్నారు మానసిక నిపుణులు. దీంతోపాటు పుస్తకపఠనం, ప్రకృతి ఆస్వాదన కూడా పని చేస్తాయి. అప్పటికి పరిష్కారం లభించకపోతే మానసిక నిపుణులను సాంప్రదించడం ద్వారా తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు.