కాబట్టి అలాంటి సిట్యువేషన్ రాకుండా అమ్మాయిలందరూ ఫైనాన్షియల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలని.. స్ట్రాంగ్‌గా ఉంటేనే బాగా పోరాటం చేయగలము" అని యాంకర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా తన యాంకరింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో రెండే రెండు చానళ్లు నలుగురు యాంకర్లు. మరి ఈరోజు అంటే 33 చానల్లో 44 మంది యాంకర్లుగా మారింది అంటూ సెటైరికల్ గా చెప్పింది. క్యాట్ అండ్ రేస్ అనేది అప్పట్లో ఉంది ఇప్పట్లోను కూడా కొనసాగుతుందని, తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తప్పులు చేశానని ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ఈ స్థాయికి వచ్చామని తన ప్రయాణంలో ఎంతోమంది రచయితలు సహకరించారని తెలిపింది. తన కెరీర్లో ఆల్ టైం ఫేవరెట్ ప్రోగ్రాం టాక్ ఆఫ్ ది టౌన్ అని ఆ ప్రోగ్రాం తో ఎంతో పాపులారిటీ వచ్చిందని తెలిపారు. అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు యాంకర్ ఝాన్సీ.
ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలావుండగా అప్పట్లో తన యాంకరింగ్‌తో ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడంటే రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, అప్పట్లో యాంకర్ అంటే మాత్రం మొదటగా వినిపించే పేరు ఝాన్సీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా దూసుకుపోయిన ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీలో కీరోల్‌లో నటించి మెప్పించింది.