అలాంటి వాటిలో అద్దె ప్రకారం ఒకరికి గర్ల్ / బాయ్ ఫ్రెండ్ గా ఉండటం కూడా వృత్తిగా కొనసాగుతున్నవారు ఉన్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అయితే ఎక్కడెక్కడ ఈ పద్ధతులు ఫాలో అవుతున్నారు చూద్దాం. జపాన్ దేశంలోని టొక్యోలో నగరంలో ఇప్పుడు చాలామంది యువతలు గంటకు,రోజుకు చప్పున ఇతరులకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండే ప్రోఫెషన్ ను ఎంచుకుంటున్నారు. ఇక్కడ అద్దె స్నేహితురాలిని రెండో కనోజో అని పిలుస్తారు. అలాగే బాయ్ ఫ్రెండ్ వృత్తిని కొనసాగిస్తున్న యువకులు కూడా చాలామంది ఉన్నారు. విహార యాత్రలకు వెళ్ళినప్పుడో, ఈవెంట్లలో తమ హోదాను ప్రదర్శించుకోవడానికో,
ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి టోక్యో నగరంలోని యువత ఇప్పుడు గర్ల్ / బాయ్ ఫ్రెండ్స్ ను అద్దెకు తీసుకోవటం చాలా కామన్ అయిపోయింది. వన్ డే తమను హైర్ చేసుకున్నావారికోసం భాగస్వామిగా లేదా గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి ముందుకొచ్చే వారు ఇక్కడ చాలామంది కనిపిస్తారు. 1990 నుంచి జపాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ పద్ధతి ఉన్నప్పటికీ, ప్రస్తుతం మరింత పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కూడా అద్దెకు భాగాస్వాములను తీసుకోవటం ఎప్పుడు చాలా సాధారణమైన విషయం గా పరిగణిస్తారు. ఇది ఇప్పుడు దేశం అంతా వ్యాపించింది. ప్రతి కంట్రీలో కూడా ఇదే జరుగుతుంది. ప్రతి వాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ కన్ఫామ్ గా ఉంటున్నారు.