చాలామంది మిగిలిపోయిన అన్నాన్ని బలవంతంగా అయినా సరే తింటారు. అలా తినటం ఆరోగ్యానికి మంచిదేనా? ఎక్కువ మంది ఉన్నా ఉమ్మడి కుటుంబాలలో అధిక మొత్తంలో అన్నం వండుతారు. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో ఆ పూట అన్నం మిగిలిపోవచ్చు. మరి ఈ అన్నాన్ని తర్వాతి పూట తినొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుండగా.. నిపుణులు అస్సలు తీసుకోకూడదని చెప్తున్నారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతుందని... వాంతులు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇప్పుడు చూద్దాం. మిగిలిపోయిన అన్నం తినటం సురక్షితం కాదు. అన్నంలో సాధారణంగా భాసిల్లస్ సిరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. వన్డే ప్రక్రియలో బాసిల్లస్ సెరియస్ బిజాంశాలు చనిపోవు. మిగిలిపోయిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లయితే... బీజాంశం విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఫుడ్ పాయిజన్ అవుతుందని 2023 లో మైక్రోబియల్ పాథోజెనిసిస్ లో ప్రచులించబడిన ఆధ్యాయనం తెలిపింది. బాసిల్లస్ సెరియస్ అని పిలవబడే బ్యాక్టీరియా వల్ల కలిగే ఫుడ్ పాయిజన్ ను ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటారు. వంట చేసిన తర్వాత రైస్ ను గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉంచినట్లయితే..

 బ్యాక్టీరియా వేగంగా పెరగడం ప్రారంభం అవుతుంది, ముఖ్యంగా వెచ్చని వాతావరణం లో బ్యాక్టీరియా వేడి - నిరోధకత కలిగిన టాక్సిన్స్ ను ఉత్పత్తి చేయగలదు. అంటే అన్నాన్ని మళ్లీ వేడి చేయటం వల్ల అది కాలుషితమైతే అనారోగ్య ప్రమాదాన్ని తొలగించలేకపోవచ్చు. అలాంటప్పుడు బాసిల్లస్ సెరియస్ తో కలుషితమైన మిగిలిన అన్నం తీసుకుంటే, ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఒకటి నుండి ఐదు గంటలలోపు ప్రారంభించవచ్చు. వికారం, వాంతులు, అతిసారం, పొత్తికడుపు నొప్పి రావచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా స్వల్పకాలికంగా ఉన్న బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వండిన అన్నం త్వరగా చచ్చిపోకుండా ఉండేందుకు కొన్ని సురక్షిత పదార్థాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: