చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆహారం ఎక్కువగా తిన్నా కానీ గురక ఎక్కువగా వస్తుంది. ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆరపు అలవాట్లలో మార్పులు, నిద్రలేమి, ఫ్యామిలీ హిస్టరి... ఇలా కారణాలు ఏమైనా ఇటీవల అనేకమంది గురక సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కేవలం బాధిత వ్యక్తిని మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని ఇతరులకు సమస్యగా మారుతుంది. రాత్రులు పడుకునే సమయంలో గురక శబ్దం వల్ల నిద్ర పట్టగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవస్థలు పడుతుంటారు.

అంతేకాకుండా గురకను నిర్లక్ష్యం చేస్తే పలు ఇతర అనారోగ్యాలకు దారి తీయవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా బాధ్యత వ్యక్తులు గురకనుంచి ఉపశ్రమమం పొందడానికి కొన్ని హోమ్ రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అవేంటో చూద్దాం. మీరు గురకతో ఇబ్బంది పడుతున్నట్లయితే రాత్రి పూట పుదీనా నీరు తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలిగించగలదని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ముందుగా కొన్ని పుదీనా ఆకులను ఒక్క గ్లాస్ నీటిలో మరిగించి,

 చల్లారిన తరువాత వాటిని తాగాలి. రోజు రాత్రి పూట నిద్రకు ముందు ఇలా చేస్తే గురక శబ్దం తగ్గుతుంది. దాల్చిన చెక్కలో గురకను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి రాత్రులు పడుకోవడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడిని కలిపి తాగాలి. ప్రశాంతంగా నిద్ర పట్టడమే కాకుండా గోరక శబ్దం తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. గురక శబ్దాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రెబ్బను తీసుకుని గోరువెచ్చని నీటిలో వేసుకుని కాసేపటి తరువాత ఆ నీటిని తాగాలి. అయితే వెల్లుల్లికి వేడి కలిగించే లక్షణం ఉంటుంది కాబట్టి వేసవి, అలాగే వేడి వాతావరణం సమయాలలో ఈ ప్రయత్నం చెయ్యకపోవటం బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: