కాఫీ ప్రియులు మాత్రమే కాదు. ఎవరైనా సరే ఫిల్టర్ కాపీ అన్నంతనే మనసు ఉత్సాహంగా ఉరకలేసేలా చేయడమే కాదు.. కాసింత కాఫీ తాగేద్దామా? అన్న ఫీలింగ్ ను తీసుకు వస్తుంది. వేడి వేడి ఘుమఘుమ లాడే ఫిల్డర్ కాఫీ దెబ్బకి ఎంతటి వారైనా సరే అనాల్సిందే.   సరైన కాఫీ  పడాలే కానీ .. ఆ అనుభూతి రోజు మొత్తాన్ని మార్చేస్తుందన్న మాట కాఫీ ప్రేమికుల నోటి నుంచి వస్తుంది.


కాఫీల్లో రకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా కాఫీ షాక్ కు వెళ్లి కాఫీ గురించి అడిగితే వారు చెప్పే వైరైటీలకు నోరు వెళ్ల బెట్టాల్సిందే. పలు రకాల కాఫీ ఆపన్ష్లు ఉన్నా ఫిల్టర్ కాఫీ కి సాటి వచ్చేది మాత్రం లేదనే చెప్పాలి. ఇక.. సౌత్ లో ఫేమస్ అయిన ఫిల్టర్ కాఫీ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీగా నిలవడం ఆసక్తికర అంశంగా చెప్పాలి.


ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ఫ్లాట్ ఫాం టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్ కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే టాప్ 10 కాఫీ రకాలను వాటిని అందించే దేశాలను చూస్తే.. క్యూబన్ ఎస్పెస్సో- క్యూబా తొలి స్థానంలో నిలిచింది. ఇక రెండోది మన ఇండియా యొక్క ఫిల్టర్ కాఫీనే.


ఫిల్టర్ కాఫీ తాగడంతో గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూడ్ బూస్టర్ గా.. ఏకాగ్రత చురుకుదనం, మానసిక స్పష్టతను మెరుగు పరిచేందుకు కాఫీ సాయం చేస్తుందని చెబుతారు. అతిగా కాకుండా మితంగా కాఫీ తాగితే మేలు. కాఫీలోని కెఫిన్ తో రక్తపోటు.. హార్ట్ రేట్.. యాంగ్లైటీని పెంచుతుందని చెబుతారు. ఈ కారణంగానే చిన్న పిల్లలు గర్భిణులు కాఫీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయం మనకి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: