ఇక తులసి మొక్క అందరి ఇంట్లో ఉంటుంది. అయితే తులసి ఎండిన ఆకు నుంచి కాండం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయ్ అంటున్నారు నిపుణులు. ఎండిపోయినా కూడా తులసి మొక్కను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు ఇప్పుడు చూద్దాం. తులసి ఎండి ఆకుల్ని మిక్స్ గ్రైండర్పట్టి గాలి చొరవని డబ్బాలో వేసి హెర్చల్ టి లేదా కషాయం తయారీకి వాడొచ్చు. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో ఓల్డ్ ను దూరం చేస్తుంది. ఫేస్ ప్యాక్స్ కోసం కూడా తులసి ఆకుల్ని వాడతారు. తులసి కాండాన్ని కూడా ఎన్నో విధాలుగా వాడవచ్చు.
ముందుగా తులసి కాండాలకు ఆకులు లేకుండా చేసి.. చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఏదైనా పూజ చేస్తున్నప్పుడు హోమం చేసేటప్పుడు ఈ కర్రల్ని ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుంది. సువాసనతో పాటు ఇంటి మొత్తానికి సానుకూల శక్తిని తెచ్చిపెడుతుంది. తులసి కాండం కట్టెల్ని కాల్చినప్పుడు తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇంట్లో ఉండే క్రిములను తొలగిస్తాయి. అంతేకాకుండా ఎండినా తులసి కాండాన్ని గంధంలా కూడా ఉపయోగించుకోవచ్చు. తులసి కలపను వాటర్ లో మరిగించి హెర్బల్ టి రెడీ చేసుకోవచ్చు. తులసి ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే వేడి నీళ్లలో నాలుగు తులసి ఆకులు వేసుకునే మరిగించిన నీరు తాగటం ఆరోగ్యానికి మంచిది.