ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ యూజెస్ మరింత ఎక్కువగా పెరిగిపోయాయి. చేతిలో మొబైల్ పెట్టుకుంటే మనకు ప్రపంచమే తెలియదు. ఉదయం లేవగానే సెల్ ఫోన్ పట్టుకుంటారు కొందరు. తినేటప్పుడు అది లేకుంటే ముద్ద దిగనంతగా అలవాటు పడేవారు మరికొందరు. సోషల్ మీడియాలో మునిగిపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోం. పక్కన ఎవరున్నారో.. ఎక్కడున్నామో.. అర్థం కాదు. పెట్టిన పోస్ట్లు లేక సెల్ఫీని ఎంతమంది చూశారు.. ఎన్ని లైక్ లు వచ్చాయి. ఎంత షేర్ అయింది. ఏం కామెంట్లు చేశారు. ఎవరు పొగిడారు.... ఇదే ప్రపంచం. పొగిడితే పొంగిపోతాం.

మిమర్శిస్తే కుంగిపోతాం. ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే అంత పాపులర్ అయ్యామని ఫీల్ అవుతాం. కనీసం పరిచయం లేని వ్యక్తిని, ముక్కు మొహం తెలియని వారిని నాకు ఫేస్ బుక్ ఫ్రెండ్' అని గొప్పగా చెప్పుకుంటాం. సరదాగా మొదలైన ఈ అలవాటు వ్యసనంగా మారింది. పిల్లలలోనూ ప్రజలుతున్న వ్యసనాన్ని ముందుగానే అరికట్టాల్సింది. ఇందుకు ఈ ఫాస్టింగ్ ఒక విధానం గా నిపుణులు చెప్తున్నారు. మరి ఈ విధానం ఏమిటి? దీనిని ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం. శాస్త్రయమో ... ఆచారమో ... ప్రతి వారం ఒక రోజు ఉపవాసం ఉండటం కొందరిలో ఒక విధానం గానే కొనసాగుతున్నది. ఆరోగ్య అవసరాల రీత్యా దీన్ని పాటిస్తున్నాం.

ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు, మనల్ని మనం కంట్రోల్ చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి కూడా దూరంగా ఉండటం ఒక అవసరం గా మారింది. ఇందుకోసం ఈ- ఫాస్టింగ్ విధానం కొన్ని దేశాలలో అమలవుతున్నది. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వినియోగం నుంచి ఎంత ఎక్కువ సేపు దూరంగా ఉండాలో నియంతరించుకోవడమే ఈ విధానం ఉద్దేశం. సరదా నుంచి అలవాటుగా, ఆ తరువాత అవసరంగా, చివరకు వ్యసనం గా మారే ధోరణి నుంచి బయట పడేయడమే దీని లక్ష్యం. ప్రతిరోజు కొంత సమయాన్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచగలిగితే మన మీద మనకు కంట్రోల్ పెరగడంతో పాటు సెల్ఫ్ డిసి ప్లెన్ కూడా అలవాటవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: