చాలామంది ఎగ్ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. మరి కొంతమందికి కోడుగుడ్డు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం లేనివారు ఈ ఎగ్ మసాలా కర్రీ తింటే అసలు వదిలిపెట్టరు. కోడి గుడ్డుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎగ్గులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ డి మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భిణీలకు కోడిగుడ్డు మంచిది. గర్భిణీలు కోడుగుడ్డుని తినటం వల్ల కడుపులో బిడ్డ క్షేమంగా ఉంటుంది.

అయితే కోడి గుడ్డుతో కేవలం 10 నిమిషాలలో రెడీ అయ్యే ఎగ్ పెప్పర్ తయారీ విధానం ఎలాగో చూద్దాం. వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, కోడిగుడ్లు - మూడు, ఉల్లిపాయలు - రెండు, అల్లం - చిన్న ముక్క, మిరియాలు - ఒక స్పూను, టమోటో - ఒకటి, ధనియాలు - ఒక స్పూను, దాల్చిన చెక్క - చిన్న ముక్క, యాలుకలు – ఒకటి, లవంగాలు - నాలుగు, కారంపొడి - అర స్పూను, నూనె - సరిపడినంత, జీలకర్ర – అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి రెండు తీసుకోవాలి. ఎగ్స్ ను ఉడకబెట్టి నిలువుగా కోసుకోవాలి. తరువాత మిక్స్ జార్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి.

 అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకుని జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి వేయించాక... మిక్సీ జార్ లో వేసి పొడిగా పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి కాస్త కారం, పసుపు సాల్ట్ వేసి.. 5 నిమిషాలయ్యాక ఎగ్ ముక్కల్ని వేసి రెండు వైపులా తిప్పుతూ వేయించి పక్కకు పెట్టాలి. అదే కడాయిలో మరింత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల తరుగు, సాల్ట్ వేసుకోవాలి. తరువాత మసాలా వేసి.. ఉడికాక అందులో కోడిగుడ్డును వేసి ఇగురులా దగ్గర వరకు కలపాలి. ఇక పైన కాస్త కొత్తిమీర జల్లితే టేస్టీ టేస్టీ ఎగ్ పెప్పర్ రెడీ ఫ్రై అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: