కాగా తాజా ఆధ్యాయనం మరో బాంబు పేల్చింది. గర్భంలో ఉన్నా బిడ్డకు తల్లి నుంచి ప్లాస్టిక్స్ చేరే అవకాశం ఉందని తెలిపింది. పాలిమైడ్ 12 అని పిలవబడే చిన్న ప్లాస్టిక్ కణాలు.. నవజాత శిశువుల గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలలోకి చేరుతాయని తెలిపింది. ఈ పరిశోధన అర్పధారణ సమయంలో పిండం అభివృద్ధిపై భయాన్ని .. తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైలెట్ చేస్తుంది. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఈ ప్లాస్టిక్ కణాలు ప్లాసెంటల్ అవరోధాన్ని దాటుకుని, అభివృద్ధి చెందుతున్న పిండాన్ని హానికరమైన కాలుష్య అరణాలకు గురిచేస్తాయి.
రట్జర్స్ హెల్త్ పరిశోధకులు చేసిన ప్రయోగంలో ఎలుకలను రోజులపాటు ప్లాస్టిక్ కణాలకు బహిర్గతం చేశారు. తల్లి, పిండం మధ్య రక్త ప్రసరణలో కూడా వీటిని గుర్తించారు. బిడ్డ పుట్టిన రెండు వారాల తరువాత పరిశీలించగా.. తల్లి మెదడు, మూత్రపిండాలు, గుండె, కాలేదుంలో ఉన్న అవే ప్లాస్టిక్స్ నవజాత శిశువుల అవయవాల్లో గుర్తించారు. ఇది బేబీ ఎదుగుదలపై భారీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. కాగా ప్లాస్టిక్ పొల్యూషన్ దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావం పై తీవ్ర ఆందోళనలను పెంచుతుంది. కాబట్టి కడుపుతో ఉన్నవారు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ లోపలికి చేరితే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. బిడ్డ కూడా క్షేమంగా ఉండదు.