ఇది రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్ ఉత్పత్తిని ప్రోత్సాహిస్తుంది. డెంగ్యూ సమయంలో కోలుకోవడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, అల్లం, పుదీనా రోగ నిరోధక శక్తి, జీర్ణ క్రియ కు మద్దతు ఇస్తాయి. వీటిన్నిటినీ జ్యూస్గా తీసుకోవటం వల్ల ప్లేట్ లెట్స్ పునరుత్పత్తికి సహాయపడుతుంది. గుమ్మడికాయ ' విటమిన్ ఏ ' కు అద్భుతమైన మూలం. కాగా ఇది ప్లేట్ లెట్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. డెంగ్యూ రికవరీ సమయంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇనుము అధికంగా ఉండే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇది ప్లేట్ లెట్స్ కౌంట్ను మెరుగుపరచడమే కాకుండా, డెంగ్యూ వల్ల కలిగే ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. గిలోయ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ప్లేట్ లెట్స్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఉసిరి లేదా అల్లంతో కలిపినప్పుడు.... అదనపు ఆంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తుంది. బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్ కౌంట్ను గణనీయంగా పెంచుతుందని... అలసట, బలహీనత వంటి డెంగ్యూ లక్షణాలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. అల్లం, పుదీనా రోగ నిరోధక శక్తి, జీర్ణ క్రియ కు మద్దతు ఇస్తాయి. వీటిన్నిటినీ జ్యూస్గా తీసుకోవటం వల్ల ప్లేట్ లెట్స్ పునరుత్పత్తికి సహాయపడుతుంది.