కాగా వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే చపాతి, రైస్ అండ్ పులావ్ మధ్యాహ్నం తీసుకుంటే నిద్రపోవడమే కాదు... శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవే కాకుండా బ్రెడ్, నూడుల్స్ కూడా నిద్రను ప్రేరేపిస్తాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోతారు. పప్పు, పెసరపప్పులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే వెజిటేబుల్ సలాడ్, పనిర్, జీడిపప్పు, బాదం, కెలిపండు తింటే మధ్యాహ్నం సమయంలో నిద్ర పోతారు.
మధ్యాహ్నం టైమ్ లో బాలు లేదా పెరుగు తింటే హాయిగా ఇట్టే నిద్రలోకి వెళ్తారు. పాలలో కాల్షియం, ట్రిప్టోఫాన్ నిద్రకు దారితీస్తాయి. మిఠాయిలు ఆఫ్టర్ నూన్ అస్సలు తినకూడదు. ఇది షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. కాగా తులసి లేదా జాస్మిన్ టి తాగండి నిద్ర నుంచి తెరుకుని యాక్టివ్ గా ఉంటారు. తేనే కలిపిన ఆహారాలు తిన్న నిద్రలోకి జారుకుంటారు. తేనెలో గ్లూకోజ్ ఉంటుంది. కాగా బాడీలోని ఓరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మానసిక ఉత్సాహం తగ్గించి నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే గ్రీన్ టీ తాగితే కూడా కళ్లు మూతలు పడుతుంటాయి. గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్ వంటి వాటిలో ఖనిజాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు నిద్రకు దారితీస్తాయి.