ఈ పనుల్ని లైట్ తీసుకుని వారం మొత్తాన్ని గజిబిజి గందరగోళంగా గడిపేస్తుంటారు. మరి ఆదివారం చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఆదివారం వస్తే కొంతమంది పడుకోవడానికి ఎక్కువగా కేటాయిస్తారు. కానీ డే మొత్తం పడుకోనవసరం లేదు. మార్నింగ్ లేచాక యోగా, ధ్యానం చెయ్యండి. దీంతో ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. అలాగే బ్యాచిలర్ అయితే ఇల్లు క్లీన్ చేసుకోండి. బట్టలు ఉతుక్కోండి. దీంతో వారం ఎలాంటి తిప్పలు ఉండవు. బ్యాచిలర్ అయినా, ఫ్యామిలీ మెంబర్ అయినా బట్టలు ఉతుక్కుని ఐరన్ చేసుకోండి. అలాగే వారానికి సరిపడా బట్టల్ని సిద్ధం చేసుకుని ఒకదగ్గర పెట్టుకోండి. దీంతో మార్నింగ్ హడావిడిగా మార్నింగ్ బట్టలు వెతుక్కోవాల్సిన పనిలేదు. పిల్లల స్కూల్ బ్యాగ్స్, ఆఫిసుకేళ్లే బ్యాగ్స్ క్లీన్ చేసుకోండి.
సండే మార్నింగ్ వారం పొడవునా చేయాల్సిన పనులు ముందే ఒక పేపర్ పైన రాసుకోండి. పిల్లల బర్త్ డ్రెస్, రిలేషన్స్ కార్యక్రమాలు, తేదీలు రాసి పెట్టుకోండి. దీంతో ఆ రోజు మర్చిపోకుండా ఉంటారు. హడావుడి కూడా తప్పుతుంది. మీకంటూ ఓ క్లారిటీ ఉంటుంది. ముందస్తు ప్లానింగ్ అందరికీ మంచిది. ఆదివారం వారానికి సరిపడా సరుకులు కొనండి. ముందుగానే సరుకుల జాబితాను మీ భాగస్వామితో మాట్లాడి ఒక పేపర్ పై రాసుకోండి. దీంతో మళ్లీ మళ్లీ ఇవి తీసుకున్నారా అవి తీసుకున్నారా అని ఫోన్ చేసి చికాకు తెప్పించే పని ఉండదు. పొరపాటున మర్చిపోయిన గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఆదివారం గంటల కొద్ది టీవీల్లో ముఖాలు పెట్టుకుండా, ఫోన్లో మాట్లాడకుండా పిల్లలతో గడపండి. సరదాగా కుటుంబీకులతో కలిసి మాట్లాడండి. ఇండోర్ గేమ్స్ ను పిల్లలతో ఆడించండి. దీంతో మీ అనుబంధం పెరుగుతుంది.