ముఖ్యంగా కళ్ళు బలహీనపడటానికి మెయిన్ రీసన్ చెడు జీవనశైలి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా. అయితే కంటి చూపును మెరుగుపరుచుకోవాలంటే మీ దినచర్య, అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి 20 నిమిషాలకోకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల డిస్టెన్స్ లో ఉన్న ఏదైనా వస్తువును చూడండి. దీంతో కళ్లకు విశ్రాంతిగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు 8 గంటలు తప్పక నిద్రపోండి. అలాగే నాణ్యత గల ఫుడ్ తీసుకోవాలి. గింజలు, పండ్లు, ఆకుకూరలు, విటమిన్ ఏ, సి, ఇ వంటి పోషకాలు ఉన్న ఆహారాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు తప్పకుండా శరీరానికి అవసరమైనంత వాటర్ తాగాలి.
లేకపోతే బాడీ డిహైడ్రేట్ అవుతుంది. కాగా కళ్లను హైడ్రేట్ గా ఉంచడానికి ఓటర్ తప్పక తాగాలి. దీంతో కంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది కంప్యూటర్ల ముందే పని చేస్తున్నారు. దీంతో సైట్ వస్తుంది. కాగా కంప్యూటర్ స్క్రీన్కు కనీసం 25 అంగుళాల దూరంలో ఉండి వర్క్ చేయండి. వర్క్ చేసే సమయంలో బ్రేక్ తీసుకుంటే కళ్లకు ఎలాంటి సమస్యలు రావు. మసగా వెలుతురులో చదవకండి. దీంతో కళ్ల పై ఒత్తిడి పడుతుంది. సన్ గ్లాసెస్ వాడండి. ఇది మూవీ కిరణాల నుంచి కాపాడతాయి. సంవత్సరానికి ఒక్కసారి అయినా కళ్లు చెకప్ చేయించుకోండి. కంటికి కండరాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే కంటి వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూడొద్దు. అదే పనిగా పుస్తకాలు చదవడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడుతుంది.