చాలామందికి గోర్లు రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఏ సమస్య అయినా ఉంటే వెంటనే గోర్లను కనిపెట్టేయవచ్చు. సాధారణంగా శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో ఓ అంచనాకు వస్తుంటారు చాలామంది. అలాగే చేతి గోర్లలో వచ్చే మార్పులు కూడా పలు అనారోగ్య సంకీర్తనలను వెల్లడిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వాటిని ముందుగానే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని అంటున్నారు. అయితే గోర్లలో ఏయే మార్పులు దేనికి సంకేతం? ఎలాంటి అనారోగ్యాలు ఉన్నప్పుడు ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. నిజానికి గోర్లు తెల్లగా ఉంటాయి.

అయితే కొందరిలో క్రమంగా అవి పసుపు రంగులోకి మారుతుంటాయి. చాలామంది దీనిని ముందుగా గుర్తించరు. ఎవరైనా చెప్తేనో, సమస్య పెరగాకనో చూస్తుంటారు. అయితే ఇలా గోర్లు యెల్లో కలర్ లోకి మారడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా స్మోకింగ్ చేసేవారిలో ఇలా మారే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్, శ్వాసకోస వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా గోర్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. కాబట్టి వారానికి మించి మీ గోర్లు రంగు పసుపుగానే కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం. గోర్లు సన్నగా ఉన్న  వాటిస్థాయిలలో అవి స్ట్రాంగ్ గానే ఉంటాయి. తరచుగా పెరుగుతుంటాయి.

కట్ చేస్తే తప్ప విరిగిపోవు. కానీ కొన్నిసార్లు కట్ చెయ్యకపోయినా టవల్, బెడ్ షీట్ వంటివి తగిలిన విరిగిపోతుంటాయి. ఇలా జరుగుతుందంటే... అనుమానించాల్సిందే. ఎందుకంటే... మీ శరీరంలో విటమిన్ బి, కాల్షియం, ఐరన్, హెల్త్ ఫ్యాట్స్ లోపం ఉంటే కూడా ఎలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గోర్లు కట్ చెయ్యకపోయినా అవి హాఫ్ మూన్ ఆకారంలో కట్ చేసిన మాదిరి మారుతుంటాయి. వీటినే ఆరోగ్య నిపుణులు వైద్య పరిభాషలో టెర్రిస్ నెయిల్స్ అంటారు. అయితే కాలేయం, మూత్రపిండాలలో సమస్యలు ప్రారంభమైన వారిలో కూడా ఈ సంకేతనాలు కనిపిస్తాయి. కాబట్టి మీ కోర్లలో మార్పులను గమనిస్తే ఎంతకైనా మంచిది ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: