చాలామంది మష్రూమ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరికొంతమందికి మాత్రం మష్రూమ్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఈరోజుల్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే కచ్చితంగా మష్రూమ్ కర్రీ పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటిలో బటన్ మష్రూమ్, షిటెక్, పోర్టోబెల్లో, రిషి వంటి పలు రకాలు ఉంటాయి. అయితే వీటిని తరచుగా తినటం వల్ల అందులోనే పోషక విలువలు పలు వ్యాధులను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే డైట్ లో భాగంగా చేర్చుకున్నప్పుడు వాటి వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పుట్టగొడుగుల్లో బీటా- గ్లూకాన్ , యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు, వివిధ వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా వీటిలోని సెలీనియం అతి ముఖ్యమైన ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి నొప్పి, మంట వంటి సమస్యలను నివారిస్తుంది. పుట్టగొడుగులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధికబరువు, ఊబకాయం వంటి సమస్యలను దూరం చేయటంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం, అజీర్తి, కడుపులో ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి ఇబ్బందులను నియంతరిస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలిగించడం వల్ల అతిగా తినే అలవాట్లను కూడా నిరోధిస్తుంది. అలాగే మష్రూమ్స్ లో ఉండే ప్రోటీన్లు కండరాల బలోపేతానికి చాలా ముఖ్యం. మష్రూమ్స్ లో పాలీ శాకరైడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడడం వల్ల ఈ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో భాగంగా రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. రిషి, షిటేక్ వంటి పుట్టగొడుగు రకాల లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు ఇటీవల పరిశోధనలో కూడా తేలింది. కాబట్టి వీటిని తీసుకోవటం ప్రోస్టేట్, కోలన్, చెస్ట్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నివారణలో అద్భుతంగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: