గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ కారణంగా కేవలం గుండెకే కాదు.. పలు అవయవాలకు కూడా ముప్పే అంటున్నారు నిపుణులు. ఆవేంటో ఇప్పుడు చూద్దాం. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం వల్ల అనేక దప్ప్రభావాలు కలుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల ఫలకం చేరి... ధమనులు ఇరుకైన లేదా నిరోధించడానికి కారణం అవుతాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో గుండె సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఛాతిలో నొప్పి, తీవ్రమైన మంట వస్తుంది. అంతేకాకుండా రక్త నాళాలు గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి.
ద్వారా రక్తపోటు వస్తుంది. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ రక్తనాళాలను ప్రభావితం చేయడమే కాకుండా.. మెదడుకు దారితీసే పలు ధమనులను కూడా పాడుచేస్తాయి. మధుమేహం ఉన్న వారిలో కూడా ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బుల్ని తెచ్చే ప్రమాదం ఉంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది. బాగా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఈ టిప్స్ పాటిస్తే సులభంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం... ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోవాలి. ఆహారంలో కచ్చితంగా ఒమేగా - 3 ఉండాలి. ఎక్కువగా నీటిలో కరిగే ఫైబర్లను తీసుకుంటే బెటర్. శరీర బరువును బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి.