శరీరంలో హార్మోన్ లా మార్పులు, అసమతుల్యత వంటివి సంభవించిన అధిక చమటలు పడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పడుకున్నా తరువాత, అర్థరాత్రిలు కూడా అనుకోకుండా అధిక చమటలతో ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా 45 నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సుగల స్త్రీలలో ఇది మెనోపాజ్ స్టేజ్ సంకేతం కూడా కావచ్చు. అలాగే థైరాయిడ్ ఎక్కువ అయినప్పుడు కూడా అకస్మాత్తుగా చమటలు పడుతుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంగా ఒత్తిడికి గురవుతారు. అయితే అధిక ఒత్తిడికి గురికావడం వేరు. ఇది అనారోగ్య లక్షణం. స్ట్రెస్, యాంగ్జైటిస్ వంటివి కొంత కాలంగా అనుభవించే వారిలో రాత్రులు అకస్మాత్తుగా అడ్రినల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చెమటలు పడతాయి.
స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్, జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యకు పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల స్లీప్ డిజాస్టర్స్, అలాగే నిద్రలేమి కారణంగా కూడా రాత్రులు అధిక చమటలు పట్టే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రంతా మేల్కోవడం శరీరంలోని జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో కొన్నిసార్లు అధిక ఆందోళనకు గురవుతారు. ఆ సమయంలో అనుకోకుండా అధిక చమటలు పడుతుంటాయి. టెన్షన్ కారణంగా బాడీ టెంపరేచర్ మరింత పెరగడం కూడా ఎందుకు కారణం కావచ్చు. బ్లడ్ లో గ్లూకోస్ లెవెల్స్ భారీగా తగ్గినప్పుడు కూడా అధిక చమటలు పడతాయి. ఈ పరిస్థితిని హైపోగ్లైసేమియా అంటారు.