అయినా కూడా ఏదో ఒక మూలా నుంచి వస్తూనే ఉంటాయి. అలాగే చాలామంది చాలా తక్కువ ధరకే లభిస్తాయని దోమల కాయిన్స్ కూడా వాడుతుంటారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా వైద్య నిపుణులు వెల్లడించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. దోమల కాయిన్స్ వాడటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ కాయిన్స్ లో డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. కాగా ఆరోగ్యానికి హానికరం ఇవి. దీని నుంని వచ్చే పొగను పీల్చుతాము కాబట్టి శ్వాస వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. అలాగే కాయిన్స్ వాసన ఆడని వారికి తలనొప్పి వస్తుంది. వికారం, మైకం, స్కిన్ పై దద్దుర్లు, కంటి సమస్యలు ఎలర్జీలు వంటివి వస్తాయి.
దీనిలోని కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు రక్తంలో తరిగి హార్ట్ లోకి చేరి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. లంగ్ కు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. కాయిన్స్ పొగ సిగరెట్టు పొగతో సమానమంటున్నారు నిపుణులు. దోమల కాయిన్స్ కారణంగా వచ్చే పొగ పిలిస్తే బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడుతుంది. మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా దోమల్ని తరిమి కొట్టేందుకు కాయిల్స్ ఉపయోగించకపోవడమే మంచిది అంటున్నారు. కాగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని.. నిల్వ నీరు లేకుండా చూసుకోండని సూచిస్తున్నారు.