కాగా అసలైన పన్నీర్ ఎలా ఉంటుందో, సింథటిక్ పన్నీర్ అంటే ఏంటి? దాని నష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ పన్నీర్ నే సింథటిక్ పన్నీర్ అంటారు. దీన్ని పాలతో కాకుండా వెజిటేబుల్ ఆయిల్, రసాయనాలు, పిండితో తయారుచేస్తారు. ఇది నిజమైన పన్నీర్ లాగే ఉంటుంది. సింథటిక్ పన్నీర్ తింటే ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరం, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాల్తీ పదార్థాలు తినటం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాగా నకిలీ పన్నీర్ ఎలా ఉంటుందో ఈ విధంగా తెలుసుకోండి. చేతుల మధ్య పన్నీర్ పెట్టి వేళ్ళతో నలపండి. కల్తీ లేని పన్నీర్ అయితే వెంటనే పిండిలాగా అవ్వదు. అలాగే పన్నీర్ తీసుకుని ఓటర్లో వేసి మరిగించండి. చల్లారాక అందులో కందిపప్పు పొడి వేయండి. కొంచెం సేపు తరువాత అది లేద ఎరుపు రంగులోకి చేంజ్ అయితే యూరియా, డిటర్జెంట్ తో కల్తీ చేసినట్లు. బాగా పన్నీర్ కల్తీ ని ఈ విధంగా చెక్ చేయండి. కాబట్టి పన్నీర్ ఎలా ఉంటుందో ఈ విధంగా టెస్ట్ చేయండి. పన్నీర్ లోని విటమిన్ డి, కాల్షియం మహిళలకు మేలు చేస్తుంది. జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో తోడ్పడుతుంది.