కొంతమంది పిల్లలైతే నైట్ ఒకటి, రెండు అయినా నిద్రపోరు. మరి కొంతమంది పిల్లలు అర్ధరాత్రి లేచి ఏడుస్తుంటారు. దీంతో ఇంట్లో ఉన్నవారికి కూడా నైట్ నిద్ర ఉండదు. నిద్రకు భంగం కలుగుతుంది. కాగా రాత్రి పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే ఏ చిట్కాలు పాటించండి. పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ తో పాటు నిద్ర కూడా ముఖ్యం. తప్పకుండా పిల్లలు కూడా 8 గంటలైనా నిద్రపోవాలి. అయితే రాత్రిపూట పిల్లలు హాయిగా నిద్రించాలంటే స్లీప్ రొటీన్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించేలా పిల్లల్ని తయారు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే పగటిపూట నిద్రపోవటం వల్ల కొంతమంది పిల్లలు రాత్రి నిద్రపోరు. కాగా పిల్లలు రాత్రి నిద్ర పోవాలంటే మంచి వాతావరణాన్ని కల్పించాలి. అందుకోసం నైట్ లైట్లు అన్ని ఆఫ్ చేయాలి. పిల్లలకు ఫోన్లు దూరంగా ఉంచాలి. ల్యాప్ ట్యాప్స్ వంటి గ్యాడ్జెట్లు వాడటం తగ్గించాలి. పడుకునే ముందు వీటికి దూరంగా ఉంచడం మంచిది. పిల్లలు పడుకునే ముందు స్నానం చేయించండి. ఆడుకుని అలసిపోతారు కాబట్టి స్నానం చేయించడం వల్ల హాయిగా నిద్రపోతారు. పిల్లలకు ఎక్కువగా వాటర్ తాగించండి. నిద్ర మధ్యలో లేస్తే నీళ్లు తాగించి మళ్లీ పడుకోబెట్టండి. అలాగే నిద్ర మధ్యలో కలవారిస్తే, పులికి పడడం లాంటివి చేస్తే తప్పకుండా వైద్యుడ్ని సంప్రదించండని నిపుణులు సూచిస్తున్నారు.