ప్రతి వారికి ఆవలింతలు మరి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకో తెలియదు అస్తమాను ఆవలిస్తూ ఉంటారు. మామూలుగా అయితే నిద్ర వచ్చేటప్పుడు మాత్రమే ఈ ఆవలింతలు వస్తాయి. కానీ కొంతమందికి నిద్ర వచ్చినప్పుడే కాకుండా ఆస్తమాను వస్తూ ఉంటాయి. తిన్న తర్వాతనో, నిద్ర వస్తున్నప్పుడో ఆవలింతలు రావడం సహజం. కానీ అవి తరచుగా వస్తుంటే మాత్రం హెల్త్ రిస్క్ లో ఉందనడానికి సంకేతాలు కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎప్పుడు ఎక్కువగా వస్తాయి? ఏయే అనారోగ్య కారణాలవల్ల వస్తాయో ఇప్పుడు చూద్దాం.

తీవ్రమైన అలసట, మానసిక, శారీరక ఒత్తిడి, ఇన్ సోమ్నియా, స్లీప్ అప్నియా, నార్కో లెప్సి వంటి నిద్రలేమి సమస్యలు ఎదుర్కొనే వారిలో ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు కొన్ని చిట్కాలు అనే ఫాలో అయితే ఈ ఆవలింతలు ఇట్టే తగ్గుతాయి. దీంతో పాటు డిప్రెషన్, యాంగ్జైటి వల్ల తలెత్తే దుప్ప్రభావాల కారణం గాను ఆవలింతలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్లీప్ అప్నియా బాధితులు నిద్రపోతున్నప్పుడు శ్వాసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తద్వారా నిద్రకు ఆటంకాలు ఏర్పడి శరీరానికి తగిన విశ్రాంతి లభించదు. ఈ క్రమంలో బాడీలో జరిగే ప్రతికూల చర్యలు ఆవలింతలను ప్రేరేపిస్తాయి.

అలాగే రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పడిపోయే సమయంలో, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. ఆగకుండా చాలాసేపు వస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులని సంప్రదించడం మంచిది. మరి ఎక్కువ ఆవలింతలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఆవలింతలు అస్తమాను వస్తుంటే ఫేస్ వాష్ చేసుకుంటే వెంటనే తగ్గుతుంది. లేదంటే టీ కానీ కాఫీ కానీ తాగితే మైండ్ రిలీఫ్ గా ఉండి ఆవలింతలు తగ్గవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి టీ తాగటం వల్ల మీ ఆవలింతలు ఇట్టే తగ్గిపోతాయి. పైన చెప్పిన విధంగా తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: