మనం తినే ఏ ఆహారంలో అయినా కానీ ఉల్లిపాయ తప్పకుండా వాడతాము. ఏ కూర వండినా గాని ముఖ్యపాత్ర ఉల్లిపాయ ఉంటుంది. ఉల్లిపాయ లేనిదే కర్రీ ఉండదు. ఉల్లిపాయలు తినటం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ ఆకు పచ్చని రంగులో ఉండే ఉల్లికాడల్లోనూ  ఔషధ గుణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున ఉల్లి గడ్డలను తింటే అనేక బెనిఫిట్స్ ఉంటాయి.

ఉల్లిపంట కోతకు రాకముందు ఉండే దశలోని వాటి మొక్కలనే ఉల్లికాడలు అంటారు. వీటిని కూరగా వండుకుని తింటారు. అయితే ఇందులోని పోషకాలు, ఔషధ గుణాల రీత్యా అవి ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు, పేగుల ఆరోగ్యానికి మంచిది. తల, కండరాలు, ఎముకలకు బలం చేకూరుతుంది. మూత్రనళల్లో నొప్పి, వాపు వంటి సమస్యలను నివారించడంలో ఉల్లికాడలు అద్భుతమైన ఆహారంగా పేర్కొంటారు. ఉల్లికాడల్లో ఉండే సల్ఫర్ శరీరంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లను, గాయాలను తగ్గించడంలో, రక్త స్రావాన్ని అరికట్టడంలో ఉల్లికాడల్లోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పనిచేస్తాయి.

డయాబెటిస్ రోగులు తింటే షుగర్ అదుపులో ఉంటుంది. యాంటీ పైరేటిక్ లక్షణాలు కలిగి ఉన్నందున ఉల్లికాడలు జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశ్రమమం కలిగించడమే కాకుండా, అవి తగ్గిపోవడానికి గల రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహాద పడతాయి. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి శీతాకాలంలో ఎక్కువగా లభించే ఉల్లికాడలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఉల్లిని తీసుకోండి. వారానికి ఒక్కసారైనా తినండి. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున ఉల్లి గడ్డలను తింటే అనేక బెనిఫిట్స్ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: