దీపావళి రోజున రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటారు. కానీ వెరైటీగా మాత్రం చెయ్యరు. ఎప్పుడు చేసిన స్వీట్స్ చేస్తారు. కానీ దీపావళి రోజున ఈ స్వీట్ను తప్పకుండా చేసుకోండి. బ్రెడ్ తో షాహి తుక్టా స్వీట్ తయారు చేసుకొని తింటే అసలు వదిలిపెట్టరు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. దివాళి అంటే తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ. కాగా ఈ ఫెస్టివల్ కు చాలామంది స్వీట్స్ చేస్తారు. ఎన్నో రకాల స్వీట్లు చేసి బంధువుల నోరు తీపి చేస్తారు. మరికొంతమంది మార్కెట్లో స్వీట్లు కొనుగోలు చేస్తారు.

 మార్కెట్లో స్వీట్లు కొనే బదులు ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ తో టేస్ట్ డెజర్ట్ షాహి తుక్టా స్వీట్ తయారు. చేయండి. రుచి అదిరిపోతుంది. అందరికి బాగా నచ్చుతుంది. బ్రెడ్ తో తయారు చేసే ఈ రాయల్ స్విట్ తయారి విధానం ఎలాగో చూద్దాం. బ్రెడ్ ముక్కలు -4, ఒక స్ఫూను పిస్తా తరుగు, నెయ్యి -4 స్ఫూన్లు, జిడిపప్పు, బాదం - ఒక స్ఫూను, పుల్ క్రిమ్ మిల్క్ -2 కప్పులు, యాలకుల పోడి - అరస్ఫూనం, పంచదార తీసుకోవాలి. ముందుగా కడాయి తీసుకుని.. బ్రెడ్ ముక్కల్ని వేయించాలి.

 మరో గిన్నె తీసుకుని పాలు పోసి అవి చక్కగా అయ్యేవరకు మరిగించాలి. అందులో యాలకులు పొడి, పంచదార, కుంకుమ పువ్వు వేసి కలపాలి. తరువాత వెడల్పు గల పాత్ర ఒకటి తీసుకుని బ్రెడ్ ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ముందు తయారు చేసిన విశ్రమాన్ని ఈ బ్రెడ్ ముక్కలపై పొయ్యాలి. ఇప్పుడు జీడిపప్పు, పిస్తా తరుగు, బాదం తరుగు దాని మీద చల్లి గార్నిష్ చేసుకోవాలి.  అంతే రుచికరమైన టేప్టి షాహి తుక్టా తయారు అయినట్లే. ఈ స్వీట్ మీ అతిథులందరికీ బాగా నచ్చుతుంది. తప్పకుండా ఈ స్వీట్ ను చేసుకోండి. ఒక్కసారి తయారు చేసుకునే తింటే అసలు వదిలిపెట్టరు. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: