చాలామంది స్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు. అలాకాకుండా స్థానానికి సరైన సమయం ఉంటుంది. ప్రపంచంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా స్నానం చేస్తుంటారు. కానీ అంతటా స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మన దేశంలో మాత్రం ప్రాచీన కాలం నుంచి ఉదయమునే స్నానం చేయడం మంచిదని భావిస్తుంటారు. కానీ చాలా ప్రదేశాలలో మాత్రం ఉదయం స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదని నమ్ముతారు. అందుకే ఇలాంటి దేశాల్లోనే ఉదయం కాకుండా రాత్రిపూట స్నానం చేస్తుంటారు. అయితే స్నానం ఎప్పుడూ చేస్తే మంచిది అన్న విషయం గురించి శాస్త్రవేత్తలకు కూడా భిన్నా భిప్రాయాలున్నాయి.

 జపాన్ లో ఎన్నో ఏండ్ల నుంచి కూడా రాత్రి పూటే స్నానం చేసే అలవాటు ఉంది. రాత్రిపూట స్నానం చేస్తే పగటిపూట శరీరానికి అంటుకున్న మురికి పోతుందని, ఒంట్లో చేరిన విష పదార్థాలు బయటకు పోతాయని నమ్ముతారు. జపనీస్ స్నాన సంస్కృతిలో ఆన్సెన్, ఆఫ్రోఉన్నాయి. వీళ్లు స్నానం చేయడానికి ముందు శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుంటారు. తొట్టిలో ఉండే వాటర్ గోరువెచ్చగా ఉంటుంది. కాబట్టి వీళ్లు వీటితోనే స్నానం చేస్తారు. ఇది వారి అలసటను తగ్గిస్తుంది. జపానీయులు రాత్రిపూట స్నానం చేస్తే రాత్రిపూట బాగా నిద్ర పడుతుందని, మానసిక ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు.

 ఇదే వారు రాత్రిపూట స్నానం చేయడానికి అసలు కారణం. రాత్రి స్నానం మనసును, శరీరాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుందని కూడా వారు నమ్ముతారు. జపానీస్ సాంప్రదాయాల్లో స్నానం ఒక ముఖ్యమైన భాగం. జపనీస్ స్నానం, వారి పని సంస్కృతికి దగ్గరి సంబంధం ఉంటుంది. చాలామంది జపానీయ కార్శికులు ఎక్కువ సేపు ఒత్తిడితో కూడిన పని చేస్తారు. సాధారణంగా వీళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తారు. అయితే పడుకునే ముందు స్నానం చేయటం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో బాగా నిద్ర పడుతుంది. ఇకపోతే దక్షిణ కొరియాలో కూడా రాత్రి పూటే స్నానం చేస్తారు. వీరు పగలంతా పనిచేసే రాత్రి స్నానం చేస్తే అలసట తగ్గుతుందని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: