సహజ ఒత్తిడి నివారిణిగా పని చేస్తుంది. దీన్ని టీ రూపంలో కూడా తీసుకుంటుండగా.. బ్లూ టి వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. శంఖంపుప్పి టీ లో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ వంటి బలమైన యంటీ సైకోట్రిక్ ప్లాంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ బయోసైన్స్ ఆధ్యాయన నివేదిక ప్రకారం... బ్లూ టీ లో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి. జంతువులపై నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్యూర్ ఆప్లైడ్ బయోసైన్స్ ఆధ్యాయంలో...
శంఖపువ్వు టీ బాడీ పెయిన్స్ నివారించడంలో సహాయపడుతుందని కనుగొనబడింది. రుమాటిక్ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులతో సహ దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశ్రమమం అందిస్తుంది. మూలిక శంఖంపువ్వు టీ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఈ బ్లూ చాయ్ జీర్ణ క్రియ కు అనుకూలమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉండటం వల్ల జీర్ణ ఎంజైమ్ లను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం,అజీర్ణం, ఉబ్బరం నుంచి ఉపశ్రమమం అందిస్తుంది. శంఖం పువ్వు ఆకులలో ఉండే బలమైన సమ్మేళనాలు కన్ఫోలిన్, కన్వాల్విన్, ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. బ్లూ టీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శక్తిని మెరుగుపరచడంలో, మానసిక ఆరోగ్యాన్ని అదుపులో ముంచడంలో సహాయపడుతుంది.