ఈరోజుల్లో చాలామంది ఆనందంగా అనేదే ఉండరు. ఆరోగ్యం కూడా ఉండాలా...? అయితే ఈ విధంగా చేస్తే ఆనందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక అభిరుచులు కూడా అందుకు దోహాద పడతాయంటున్నారు మానసిక నిపుణులు. సాధారణంగానే ప్రతి ఒక్కరికి రొటీన్ అంశాలతో పాటు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలన్న ఉత్సుకత ఉంటుంది. అదే నీలోని ప్రతిభను వెలికి తీస్తుంది. ఆలోచనలను, ఆందోళనలు దూరం చేస్తుంది. అందుకే తమకంటూ ఏదో స్పెషాలిటీ ఉండే హబీస్ అలవర్చుకుంటారు చాలామంది. అయితే వ్యక్తులను ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి?

 ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పెయింటింగ్, డ్యాన్సింగ్, మ్యూజిక్, రిడింగ్, అల్లికలు, ఆటలు, వ్యాయామాలు ఇలా ఏదో ఒక హాబీ కలిగి ఉన్నప్పుడు మరింత హెల్తీగా ఉంటారని పరిశోధనలు సైతం వెల్లడించాయి. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. వయసు రీత్యా అవి పలు అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. అలాంటి వాటికి చెక్ పెట్టడంలో అభిరుచులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే యువతి యువకుల్లోనూ పలు రకాల హాబీస్ వారిలో అదనపు జ్ఞానానికి, క్రియేటివిటీ కి సహాయపడతాయి.

 రొటీన్ కు భిన్నంగా మీకు ఇష్టమైన అభిరుచులు కలిగి ఉండటం మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి స్ట్రెప్, యాంగ్జైటి, డెమెన్షియా వంటి రుక్మతాలను దూరం చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రధానంగా న్యూరో ప్లాసిసిటిని పెంచడం ద్వారా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగాను సహాయం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాదు నాడి వ్యవస్థలో మార్పులకు కారణం అయి, కొత్త విషయాలను నేర్చుకోవటంలో, నైపుణ్యాలు అలవర్చుకోవటంలో అభిరుచులు కీలకపాత్ర పోషిస్తాయి. మ్యూజిక్ లో ప్రావీణ్యం సంపాదించిన ఒక వ్యక్తి మేథమెటిక్స్ లో కూడా రాణించారనుకుందాం. దీని వెనుక కచ్చితంగా ఆసక్తితో పాటు అభిరుచు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: