దీపావళి రోజున చాలామంది తొక్కుడు లడ్డు స్వీట్ గా చేసుకుంటారు. మరికొంతమంది రకరకాలుగా ఏదో ఒక స్వీట్ తయారు చేసుకుంటారు. దీపావళికి చాలామంది రకరకాల స్వీట్స్ తయారు చేస్తారు. కొంతమంది రిస్క్ ఎందుకని మార్కెట్లో స్వీట్ లను కొనుగోలు చేస్తారు. స్వీట్లలో లడ్డుకు మరింత ఫాన్స్ ఉంటారు. లడ్డు పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఉరుతాయి. పైగా లడ్డులో తొక్కుడు లడ్డు అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

కాగా దీపావళికి బయట స్వీట్స్ కొనే బదులు ఈ సింపుల్ లడ్డూను ఇంట్లోనే తయారు చేసుకోండి. మీ అతిధులకు, ఇంటిల్లిపాదికి బాగా నచ్చుతుంది. మరి తొక్కుడు లడ్డు విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని సెనగపిండి, వాటర్ పోసుకుని బాగా కలిపి.. చపాతి పిండిలా తయారు చేసుకోవాలి. తరువాత గ్యాస్ పై కడాయి పెట్టి ఆయిల్ పోసి... పిండిని జంతికల గొట్టంలో వేసి జంతికిల్లా నూనెలో వెయ్యాలి. మొత్తం వేయించడం అయ్యాక.. ఒక గిన్నెలోకి తీసుకుని చిన్నగా విరుచుకోవాలి. అనంతరం ఈ మొక్కల్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.

దీనిలో షుగర్, చిటికెడు సాల్ట్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూల చుట్టుకుంటే అంతే. రుచికరమైన తొక్కుడు లడ్డు తయారైనట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అసలు వదిలిపెట్టారు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. దీపావళి రోజునే కాదు ఉత్తప్పుడు కూడా ఈ లడ్డుని చేసుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వటానికి ఆయన ఈ లడ్డు చాలా బాగుంటుంది. చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈ లడ్డుని పెడితే అసలు వదిలిపెట్టరు. ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ లడ్డుని వదిలిపెట్టరు.

మరింత సమాచారం తెలుసుకోండి: