అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని నివారణ పద్ధతులను సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. వాతావరణ మార్పు వల్ల ఉదయం, సాయంత్రం చలిగాలులు వీస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారిలో సమస్య మరింత అధికం అవుతుంది. రోజువారి పనులు చేసుకోవటం కూడా కష్టంగా మారుతుంది కొందరికి. అయితే చలికాలంలోనూ తరచుగా వ్యాయామాలు చేయడం ఎందుకు చక్కటి పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. వెదర్ కారణంగా అసౌకర్యంగా అనిపించినా వ్యాయామం తరువాత మంచి ఫలితాలను ఇస్తుంది.
రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. కాళ్లు, చేతుల్లో పాపు తగ్గుతుంది. చలి కారణంగా కీళ్ల నొప్పులు ఎదుర్కొనే వారు ఈ సీజన్లో గోరువెచ్చని నీటిని తాగటం మంచిదంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అలాగే గోరు వెచ్చని నీటిలో ఆవాల నూనె చుక్కలు కలిపి పాదాలు, చేతులు ఆ నీటిలో కాసేపు ఉంచి తరువాత శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. దీంతో కీళ్ళ నొప్పులు నుంచి ఉపశ్రమణం కలుగుతుంది. ఒకవేళ మీకు వ్యాయామం చేయడానికి తగిన సమయం లేదనుకుంటే చలికాలంలో డైలీ స్ట్రెచింగ్ కూడా చేయవచ్చు. దీనివల్ల కాళ్లు, చేతులు, కీళ్ల భాగంలో కదలికల వల్ల నొప్పి నుంచి ఉపశ్రమణం పొందుతారు. అలాగే శరీరాన్ని చలి వాతావరణం నుంచి రక్షించుకోవాలి. వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లకు సాక్స్, చేతులకు క్లాతింగ్ గ్లోవ్స్ ధరించవచ్చు.