హిందువుల పండగలలో అత్యంత ముఖ్యమైనది దీపావళి ఒకటి అని చెప్పుకోవచ్చు. అయితే దీపావళి నాడు చాలా మంది టపాసులు, బాణసంచా కాల్చుతారు. కానీ ఈ సమయంలో ఆస్తమా రోగులకు వ్యాధి మరింత తీవ్రమవుతుంది. వాయుకాలుష్యం వల్ల పెరిగి... పొగలో సల్ఫర్ డయాక్సైడ్, సీసం, పొటాషియం, నైట్రోజన్ ఆక్సైడ్, సోడియం విషపదార్థాలు అధికంగా ఉంటాయి. దీంతో శ్వాస కోసం సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అంతేకాకుండా అలర్జీలకు కారణం అవుతాయి. కాగా ఆస్తమా వ్యాధిగ్రస్తులు దీపావళికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
అవేంటో ఇప్పుడు చూద్దాం. దీపావళి నాడు ఆస్తమా రోగులు నాణ్యతమైన మాస్క్ ధరించడం మంచిది దీంతో వాయు కాలుష్యం నుంచి బయటపడవచ్చు. అలాగే మీ శ్వాస మార్గాలను తేమగా ఉంచడానికి వాటర్ ఎక్కువగా తీసుకోండి. దీపావళి రోజు కొవ్వు, మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండండి. అలాగే వెచ్చగా ఉండే బట్టల్ని వేసుకోండి. స్మోకింగ్ చేయటం మానాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం మేలు. నేరుగా ఏసీ, ఫ్యాన్లు కింద కూర్చోవద్దు. దుమ్ము, పొగ ప్రాంతాలకు దూరంగా ఉండండి. అలాగే దీపావళికి ముందు వైద్యున్ని సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటిస్తే దీపావళికి ఆస్తమా రోగులు ఏ టెన్షన్ లేకుండా ఉండోచ్చు.