"ధనం మూలం... ఇదం జగత్!" అన్నారు పెద్దలు. అవును, అదే నానుడి ఇపుడు వందశాతం ప్రూవ్ అవుతోంది. నేటి దైనందిత జీవితంలో డబ్బు లేకుండా మనగలగడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు! భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుందో లేదో తెలియదు గానీ, నేటి మనిషిని మాత్రం డబ్బు తన చుట్టూ తిప్పుకుంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. అవును, ఇక్కడ నోటు ఉంటే ఇక మనిషికి ఏ లోటు లేనట్టే!

అయితే, మనం నిరంతరం అవసరాలకోసం ఖర్చుచేసే ఇండియన్ కరెన్సీ తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే, మీరు అవాక్కవుతారు. మన దగ్గరకు వచ్చే ప్రతీ నోటును భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తుందనే సంగతి విదితమే. ఇక దేశంలో చాలా చోట్ల ఇలాంటి నోట్ల ముద్రణ కేంద్రాలు ఉండగా, ఇక్కడ ముద్రించిన నోట్లను దేశవ్యాప్తంగా సర్క్యూలేట్ చేస్తుంటారు. భారతదేశంలో నోట్ల ముద్రణ 1957 నుంచి జరుగుతోంది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, వెయ్యి రూ. 10 నోట్లను ముంద్రించడానికి సుమారు రూ. 960 ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

ఈ లెక్కన చూసుకుంటే, ఒక్క రూ. 10 నోటుకు ప్రభుత్వం 96 పైసలు ఖర్చు చేస్తుందన్నమాట. ఇక వెయ్యి రూ. 20 నోట్ల ముద్రణ చేయడానికి రూ. 950 ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఒక్క రూ. 20 నోటును ముద్రించేందుకు 95 పైసలు ఖర్చవుతుంది. అదేవిధంగా 50 నోట్ల ముద్రణకు రూ. 1,130 ఖర్చు కాగా, ఒక్కో 50 రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్బీఐ సుమారు రూ. 1.13 పైసలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అలాగే, వెయ్యి రూ. 100 నోట్లను ముంద్రించేందుకు ఆర్బీఐ రూ. 1770 ఖర్చు చేయగా, ఒక్కో రూ.100 నోటును ముద్రించేందుకు ఆర్బీఐ రూ.1.77 ఖర్చు కేటాయిస్తుంది. ఇక రూ. 200 నోటు విషయానికొస్తే వెయ్యి రూ. 200 నోట్లను ముద్రించేందుకు ఆర్బీఐ రూ. 2370 ఖర్చు చేయగా ఒక్కో రూ. 200 నోటును ముద్రించేందుకు రూ. 2.37 ఖర్చు చేస్తోంది. అదేవిధంగా 2021-22 ఆర్థిక ఏడాదిలో వెయ్యి రూ. 500 నోట్లను ముద్రించేందుకు రూ. 2290 ఖర్చయింది. ఈ లెక్కన ఒక్క రూ. 500 నోటును ముద్రించేందుకు రూ. 2.29 ఖర్చవుతుంది. కాబట్టి ఇపుడు అర్ధం అయిందా... ఇండియాలో కరెన్సీ నోట్లు తయారికి.. ఎంత ఖర్చు అవుతుందో అని!

మరింత సమాచారం తెలుసుకోండి: