ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమిటో చూద్దాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తుల మనసులో నాటుకు పోయిన బలమైన భావాలను బట్టి, ఎదుర్కొన్న సంఘలను బట్టి, వారి ప్రవర్తననుబట్టి కూడా కలలు వస్తాయి. కొన్నిసార్లు మనలో ఉత్సాహం నింపే కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందానికి కారణం అయ్యే కలలు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు భయంకరమైనవి, ఆందోళన కలిగించేది వస్తుంటాయి. అయితే వీటిల్లో గుర్తుండేవి మాత్రం చాలా తక్కువ. వాస్తవానికి రాత్రులు వచ్చే కళల్లో 99 శాతం వరకు మనకు గుర్తుండవని పరిశోధకులు అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.
రాత్రులు నిద్రపోయినప్పుడు మెదడులో జరిగే కొన్ని రసాయనిక మార్పులు కలలు రావడానికి, వచ్చినా గుర్తుండకపోవడానికి దారితీస్తాయి. ముఖ్యంగా కంటి కదలిక సమయంలో, నోర్పెనెఫ్రైన్, సెరోటోనిన్, ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్ మిటర్లు మెదడును ప్రభావితం చేస్తాయి. అవి కలలు వచ్చే సందర్భంలో క్రియారహితం చేయబడతాయని, జ్ఞాపకాలను ఏకికృతం చేయడాన్ని కష్టతరం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల కలలు గుర్తుండవు. అలాగే డ్రీమ్స్ స్వల్పకాలిక మెమోరీలో నిల్వచేయబడే ' మెమోరీ కన్సాలిడేషన్' కూడా పరిమిత సామర్ధ్యాన్ని, వ్యవధిని కలిగి ఉంటుంది. దీనివల్ల కూడా కలలు గుర్తుండవు.