అయితే మనం తరచుగా వాడే కొన్ని రకాల తెల్లని ఆహారాలు కూడా హెల్త్ కు మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. తెల్లటి చెక్కర, తెల్ల రోట్టె, తెల్ల బియ్యం, తెల్ల ఉప్పు, తెల్ల వెన్న వంటివి అధికంగా తీసుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. తెల్లటి చక్కెర అధికంగా తీసుకోవటం శరీరంలో మంట, కేలరీలు, లిపిడ్లు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక వైట్ బ్లడ్ లో ఫైబర్ ఉండదు కాబట్టి, జీర్ణక్రియ కు హాని కలిగిస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
తెల్లటి బియ్యం అధికంగా పాలిష్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటూ వేరే ఆహారాలు తీసుకోకపోతే బబేసిటి, గుండె జబ్బులకు దారితీయవచ్చు. అలాగే తెల్లటి ఉప్పు అధికంగా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా సముద్రపు ఉప్పు లేదా పింక్ సాల్ట్ ఉపయోగించటం బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇక వైట్ బెటర్ వంటి ప్రాసెస్ చేయబడిన కొవ్వులు గుండె ఆరోగ్యానికి హానికరం కాబట్టి బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వంటివి వాడాలని సూచిస్తున్నారు. కాబట్టి తెల్లగా ఉన్న ఆహారాన్ని అసలు వాడకండి.