ఈ సందర్భంగా ఆస్పత్రులకు వెళ్తే వేలల్లో ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఇంట్లోనే నయం చేసుకోగల హోమ్ రెమెడీస్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. కాలుష్యం వల్ల తలెత్తిన దగ్గును తగ్గించడంలో అల్లం ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసి చక్కెరలో కలిపి తీసుకున్న, తేనెలో కలిపి తీసుకున్నా, అల్లం కషాయం తీసుకున్న దగ్గు నుంచి ఉపశ్రమణం లభిస్తుంది.
అలాగే తేనె నేరుగా తీసుకోవడం కూడా కాలుష్యం వల్ల తలెత్తిన దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో డెక్ట్స్ ట్రో మెథోర్ఫాన్ అనే మూలకం ఉంటుంది. కాబట్టి తేనె కపాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓ చెంచా తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దగ్గు, కఫం సమస్యలు మాయమవుతాయి. ఉప్పు నీటితో కుక్కలించడం కూడా కాలుష్యం వల్ల ఏర్పడిన దగ్గును నివారిస్తుంది. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాస కోసం వ్యవస్థ శుభ్రపడుతుంది. గొంతులో గరగర, నొప్పి, దగ్గు నుంచి తక్షణంఒక ఉపశమనం లభిస్తుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ సాల్ట్ కలిపి రోజుకు రెండు లేదా మూడుసార్లు పుక్కిలించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.