ఆడవాళ్లు ఎక్కువగా ఫ్యాషన్ షోలో పాల్గొంటారు. మటన్ మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్ షో కి వెళ్తారు. ఫ్యాషన్ షో లో మోడల్స్ ర్యాంప్ వాక్ చెయ్యడాన్ని మీరు గమనించే ఉంటారు. అక్కడి వాతావరణంమంతా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. కోంగ్రోత్త డిజైనర్ దుస్తులతో, ఆకట్టుకునే హవ భావాలతో వారు క్యాట్ వాక్ ప్రారంభించగానే ప్రేక్షకులంతా ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. అక్కడున్న ప్రతి ఒకరి మొహం పై చిరునవ్వులు చిందిస్తూ ఉంటాయి. కానీ రాంప్ పై తళుక్కుమంటున్న మోడల్స్ మాత్రం సీరియస్ గా కనిపిస్తారు. ఈ సందర్భంగా వారు అసలు నవ్వరు.అయితే దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంటుందన్నారు నిపుణులు. అదేంటో చూద్దాం.

వాస్తవానికి నవ్వు సానుకూలతకు ప్రతిరూపం. ఎదురుగా ఎవరైనా ఉన్నప్పుడు చిరునవ్వు చిందించారంటే, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని అవతలి వ్యక్తి భావించే అవకాశం ఎక్కువ. దీంతో అవతలి వ్యక్తి మనసులో సమానత్వ, సానుకూల భావన ఏర్పడుతుంది. అయితే మోడల్స్ మాత్రం ఫ్యాషన్ లో ఇలాంటి భావనలకు భిన్నంగా ఉండాలనుకుంటారు. ఇక్కడ ఇతరులను డామినేట్ చేసేలా తమ బిహేవియర్ ఉండాలని ఆలోచిస్తారు. ఇది రాంప్ వాక్ లేదా ఫ్యాషన్ షో నిర్వహణలో ఒక అంతర్గత నిబంధనగా కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ర్యాంపు పై ఉన్నప్పుడు నవటం వల్ల తమ హోదా లేదా స్థానాన్ని ప్రేక్షకులు గుర్తించే అవకాశం తగ్గుతుందని మోడల్స్ భావిస్తారు. తమ నవ్వులు, మాటలు వంటివి ఆడియన్స్ను ఆకట్టుకుంటే... తాము ధరించిన దుస్తులను, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ను వారు నిర్లక్ష్యం చేయవచ్చు. దీంతో తాము అనుకున్నా మెసేజ్ ప్రేక్షకుల్లోకి వెళ్ళదు. అదే గాంభీర్యంగా ఉంటే ప్రేక్షకులు మోడల్స్ మొహాలను, వారి మాటలను పట్టించుకోరు. దీంతో వారి హవ భావాలపై, ధరించిన దుస్తులపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి మోడల్స్ ఈ సందర్భముగా నవ్వరని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నవ్వడం అనేది సానుకూల భావోద్వేగానికి, సీరియస్ నెస్ అనేది అక్కడున్న పరిస్థితిపై పైచేయి కలిగి ఉన్న భావనకు నిదర్శనంగా సీరియస్ నెస్ అనేది అక్కడున్న పరిస్థితిపై పైచేయి కలిగి ఉన్న భావనకు నిదర్శనంగా భావిస్తారు ఎవరైనా.

మరింత సమాచారం తెలుసుకోండి: