మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ ని తప్పకుండా తాగండి. ఈ జ్యూస్ లో ఎన్నో పోషకాలు నిండి ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆకలి తీర్చుకోవడానికి మనం ప్రతిరోజు అన్నం, రొట్టెలతో పాటు వివిధ ఆహార పదార్థాలు తింటుంటాం. ఇవన్నీ జీర్ణమై శరీరానికి శక్తినిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు సక్రమంగా డైజెస్ట్ కాకపోవటం వల్ల టాక్సిన్ల రూపంలో అవి బాడీలోనే ఉండిపోతాయి. వీటినే బ్యాడ్ కొలెస్ట్రాల్ గా పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. దీర్ఘకాలికంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవటం, వాటిని కరిగించి శక్తిరూపంలో మార్చడానికి అవసరమైన శారీరక శ్రమలేకపోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులకు దారితీస్తాయి.

 వీటిని నుంచి తప్పించుకోవాలంటే టాక్సిన్లను ఎప్పటికప్పుడు బయటకు పంపాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రకాల జ్యూస్ కూడా అందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం. ఎబిసి జ్యూస్ అంటే మరేదో కాదు, యాపిల్, బీట్ రూట్, క్యారెట్ లతో తయారు చేసే డ్రింక్స్. వీటివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరిరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో, పేరుకుపోయిన కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. లివర్ ను డిటాక్స్ చేసి... టాక్సిన్లను బయటకు పంపడంలోనూ కిలకప్రాత పోషిస్తాయి.

 అలాగే ఈ జ్యూస్ బీటా  కెరోటిన్, యాంటి ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సీతో పాటు బాడీని డిటాక్స్ చెయ్యదల శక్తి ఉంటుంది. కాబట్టి లెమన్ జ్యూస్ తాగటం ఆరోగ్యానికి మంచిది. దీంతోపాటు కొంచెం అల్లం కూడా తీసుకోవటం ఇంకా మేలు చేస్తుంది. అల్లం షాట్ లో నిమ్మరసం పిండుకుని తాగవచ్చు. అల్లం టీ తయారు చేసి అందులో నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచి బాడీని డిటాక్స్ చేస్తుంది. లివర్ ని క్లిన్స్ చేస్తుంది. ఇవి రెండు అధిక బరువను తగ్గించడంలో సహాయపడతాయి. చాలామంది జలుబు, ప్లూ వంటివి చేసినప్పుడు పాలలో మిరియాలు, పసుపు కలిపి తాగుతుంటారు. వాస్తవానికి ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. శరీరంలోని టాక్సిన్ ను బయటకు పంపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: