పోషక ఆహారాలు తీసుకోకపోవడం వల్ల నరాలు బలహీనంగా మారుతున్నాయి. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారాన్ని తీసుకోండి. మానవ శరీరంలో నరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటిది నరాలు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి. మెమొరీ లాస్ అవడం, తిమ్మిర్లు రావడం, కండరాల బలం కోల్పోవడం, దీర్ఘకాలిక తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా నరాల బలహీనతకు చెక్ పెట్టడానికి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

 అంతేకాకుండా ఆకు పచ్చని కూరగాయలు, ఆకు కూరలలో నరాలు బలానికి కావాల్సిన పోషకాలు దట్టంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలేట్, మెగ్నీషియం, రాగి, కాలుష్యం, వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నరాలకు శక్తిని చేకూరుస్తాయని వైద్యులు చెబుతూనే ఉంటారు. వీటితో పాటు ఈ ఫుడ్స్ తో నరాల బలం పెరుగుతుందని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నరాల బలానికి సిట్రస్ ఫుడ్స్ మేలు చేస్తాయి. నారింజ, నిమ్మ, బత్తాయి, గ్రేప్స్ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవే. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఫుడ్స్ ను సిట్రస్ పండ్లు అంటారు.

వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, ఫైబర్, ప్లాంట్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అందుతుంది. ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నరాలు దెబ్బతినకుండా కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండే క్వినోవా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, విటమిన్, బి6 వంటివి దట్టంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ నరాల వీక్ నెస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో బ్లూబెర్రీ పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. నరాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా మెండుగా ఉంటాయి. గుమ్మడి గింజల ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: