తెల్ల ఉప్పు కూడా అధిక మోతాదులో తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు తలెత్తుతాయని చెబుతున్నారు. వీటితో పాటుగా ఈ తెల్లటి పదార్థాలకు కూడా దూరంగా ఉండే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెల్లరొట్టె తింటే జీర్ణ క్రియ కు హాని కలుగుతుంది. వైట్ బ్రెడ్ షుగర్ ను కూడా పెంచుతుంది. అలాగే తెల్ల చక్కెర అధికంగా తీసుకోవటం వల్ల మధుమేహం సమస్య తలెత్తుతుంది.
బాడీలో కేలరీలు, మంట, లిపిడ్లు, షుగర్ లెవెల్స్ ను పెంచడానికి వైట్ షుగర్ బాధ్యత వహిస్తుంది. తెలుపు వెన్న కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. గుండెకు హానికరం కలిగిస్తుంది. తెల్ల బటర్ వంటి ప్రాసెస్ చేసినా కొవ్వులు హర్ట్ కు హాని చేస్తాయి. కాగా ప్రత్యామ్నాయ దారిని పెంచుకోవాలని... అందుకోసం ఆలీవ్ ఆయిల్ లేదా కొబ్బరి ఆయిల్ వంటివి వాడమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. తెల్లటి పదార్థాలని అసలు తీసుకోకండి. తెల్లటి పదార్థం తినటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తెల్లటి ఆహారాన్ని అసలు తినకండి. కాగా ఈ ఐదు తెల్లటి పదార్థాలకు దూరంగా ఉంటే ఈ రోగులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా తెల్ల బియ్యం పాలిష్ చేయటం వల్ల చాలా పోషకాలు కోల్పోతాయన్న విషయం తెలిసింది.